Telugu Gateway
Cinema

'అఖండ‌' హంగామా

అఖండ‌  హంగామా
X

నందమూరి బాలకృష్ణ హీరోగా న‌టించిన అఖండ సినిమా హంగామా గురువార‌రం ఉద‌యం నుంచే ప్రారంభం అయింది. ఈ సినిమా పై టాలీవుడ్ కు చెందిన ప్ర‌ముఖులు కూడా వ‌ర‌స ట్వీట్లు చేసి బాలకృష్ణ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వ‌స్తున్న స్పంద‌న చాలా బాగుంద‌ని..చిత్ర యూనిట్, హీరో బాలకృష్ణ , ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీనుకు అభినంద‌న‌లు తెలిపారు హీరో మహేష్ బాబు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. అఖండ విజ‌యాన్ని తెలుగు సినీ ప‌రిశ్ర‌మ సెల‌బ్రేట్ చేసుకుంటోంద‌ని ద‌ర్శ‌కుడు మ‌లినేని గోపీచంద్ పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల‌తోపాటు అమెరికాలోనూ అఖండ సినిమా మంచి ఓపెన్సింగ్ సాధించిన‌ట్లు రిపోర్టులు వ‌స్తున్నాయి. గురువారం నాడు రెండు తెలుగు రాష్ట్రాల‌తోపాటు అమెరికాలో తెలుగు వారు ఎక్కువ ఉండే ప్రాంతాల్లో నందమూరి బాలకృష్ణ అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. సోష‌ల్ మీడియాలోనూ బాల‌య్య అభిమానులు హంగామా సాగింది. హీరో నందమూరి బాలకృష్ణతోపాటు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను, మ్యూజిక్ డైర‌క్ట‌ర్ త‌మ‌న్, నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి త‌దిత‌రులు ఏఎంబీలో అఖండ సినిమాను చూశారు.

Next Story
Share it