Telugu Gateway
Cinema

'అఖండ' సెన్సార్ పూర్తి

అఖండ సెన్సార్ పూర్తి
X

నందమూరి బాలకృష్ణ, ప్ర‌గ్యాజైస్వాల్ జంట‌గా న‌టిస్తున్న సినిమా అఖండ‌. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్న‌ట్లు చిత్ర యూనిట్ ఆదివారం నాడు ప్ర‌క‌టించింది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై బాల‌య్య అబిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించ‌గా..త‌మ‌న్ మ్యూజిక్ అందించారు.

చిత్ర యూనిట్ ఇప్ప‌టికే ఈ సినిమాను డిసెంబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. యాదృచ్చికంగా ఈ సినిమా షూటింగ్ గ‌త ఏడాది నవంబ‌ర్ 21న ప్రారంభం కాగా..సినిమా సెన్సార్ కూడా స‌రిగ్గా ఏడాది త‌ర్వాత ఇదే రోజు పూర్తి చేసుకుంద‌ని హీరోయిన్ ప్ర‌గ్యా జైస్వాల్ త‌న సోష‌ల్ మీడియా పో్స్టులో ప్ర‌స్తావించారు.

Next Story
Share it