Telugu Gateway
Cinema

బాలకృష్ణ సినిమా 'అఖండ'

బాలకృష్ణ సినిమా అఖండ
X

ఉగాది రోజు సినీ అభిమానులకు పండగే. పలు సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ వరదలా వచ్చి పడ్డాయి. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కతున్న సినిమాకు సంబంధించిన టైటిల్ ప్రకటనతోపాటు ఓ వీడియోను కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సారి బాలకృష్ణ 'అఖండ' ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటివరకూ బీబీ3 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటూ వచ్చింది. బోయపాటి, బాలకృష్ణల కాంబినేషన్ లో ఇది మూడవ సినిమా.

ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌గ్యా జైస్వాల్ క‌థానాయిక‌గా నటిస్తుండగా.. పూర్ణ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. 'కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది... కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది...' అంటూ బాలయ్య చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ విలన్‌గా కనిపించనున్నాడు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story
Share it