Telugu Gateway
Cinema

అఖండ 2 కు తొలగిన అడ్డంకులు

అఖండ 2 కు తొలగిన  అడ్డంకులు
X

నందమూరి బాలకృష్ణ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అఖండ 2 . డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా ఎవరూ ఊహించని రీతిలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, ఎరోస్ ఇంటర్నేషనల్ మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల కారణంగా ఈ సినిమా కు మద్రాస్ హై కోర్ట్ బ్రేకులు వేసింది. ఇప్పుడు కోర్టు కియరెన్సు రావటంతో పాటు నిర్మాణ సంస్థల మధ్య సెటిల్ మెంట్ జరగటంతో అన్ని అడ్డంకులను పూర్తి చేసుకున్న అఖండ 2 తాండవం బాక్స్ ఆఫీస్ దగ్గర తాండవం చేయటానికి రెడీ అయింది. డిసెంబర్ 11 రాత్రి ఈ సినిమా ప్రీమియర్స్ పడనున్నాయి...సినిమా డిసెంబర్ 12 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ ను గాడ్ ఆఫ్ మాసెస్ గా పిలుస్తారు అనే విషయం తెలిసిందే.

బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచినా సంగతి తెలిసిందే. ఇదే కాంబినేషన్ నాలుగోసారి కావటంతో అంచనాలు మరింత పెరిగాయి. సనాతన ధర్మం నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో మాస్, యాక్షన్ అంశాలతో పాటు పలు ఎలిమెంట్స్ ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వబోతున్నాయి. తమన్ అందించిన సంగీతం సినిమాలో ఒక రేంజ్ కు తీసుకెళ్లనుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఈ మూవీని రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించగా, ఎం. తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Next Story
Share it