Telugu Gateway
Cinema

ఫస్ట్ డే సాలిడ్ వసూళ్లు

ఫస్ట్ డే సాలిడ్ వసూళ్లు
X

భారీ అంచనాల మధ్య డిసెంబర్ 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ 2 తాండవం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్మురేపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసిన ప్రీమియర్స్ తో కలుపుకుని ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 59 . 5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన నాల్గవ సినిమా ఇది. గత మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలవటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అఖండ 2 తాండవం మూవీ కి రివ్యూ ల్లో మిశ్రమ స్పందన వ్యక్తం అయినా కూడా కలెక్షన్స్ ఆశాజనంగానే ఉన్నాయని చిత్ర యూనిట్ చెపుతోంది.

ఈ సినిమా ఎక్కువ గా హిందూ ధర్మం...సనాతన ధర్మంపైనే సాగింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో అఖండ పాత్రలో బాలకృష్ణ నటనకు ఆయన ఫ్యాన్స్ అయితే ఫుల్ కుషీగానే ఉన్నారు అని చెప్పాలి. మరి ఈ వీకెండ్ లో సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయి...ఓవరాల్ గా థియేట్రికల్ రన్ పూర్తి అయ్యే నాటికీ అఖండ 2 తాండవం మూవీ మొత్తం ఎంత వసూళ్ల రాబడుతుంది అన్నదే ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారిన అంశం. గతంలో ఎన్నడూ లేని రీతిలో బాలకృష్ణ సినిమా ఈ సారి బాక్స్ ఆఫీస్ దగ్గర పలు అవాంతరాలు ఎదుర్కొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

Next Story
Share it