Telugu Gateway
Cinema

తేజ ద‌ర్శ‌క‌త్వంలో ద‌గ్గుబాటి అభిరామ్

తేజ ద‌ర్శ‌క‌త్వంలో ద‌గ్గుబాటి అభిరామ్
X

ఎంతో ముంది యువ హీరోల‌ను టాలీవుడ్ కు ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుడు తేజ‌. ఇప్పుడు టాలీవుడ్ లో ప‌లు విభాగాల్లో బ‌ల‌మైన ప‌ట్టు ఉన్న కుటుంబానికి చెందిన యువ హీరోతో ముందుకు రాబోతున్నాడు. ద‌గ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్‌ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు తేజ. ఫిబ్రవరి 22న తేజ బర్త్‌డే. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్, టైటిల్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ సినిమాకి 'అహింస' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.

అభిరామ్ ముఖం కనిపించకుండా కళ్ళవరకూ గోనె సంచితో కట్టేసి ఉండగా.. అతడి నోటి నుంచి రక్తం కారుతూ ఉండే లుక్ ఆకట్టుకుంటోంది. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌ధాన భాగం షూటింగ్ పూర్తి అయిందని సోష‌ల్ మీడియాలో లుక్ విడుద‌ల సంద‌ర్భంగా పేర్కొన్నారు.

Next Story
Share it