Telugu Gateway
Cinema

ఇందులోనూ సెన్సేషన్ తప్పదా!

ఇందులోనూ సెన్సేషన్ తప్పదా!
X

యష్ హీరో గా నటించిన టాక్సిక్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం కేజీఎఫ్ రెండు పార్ట్ ల తర్వాత ఈ హీరో నుంచి వస్తున్న సినిమా ఇదే కావటం కూడా ఒకటి. టాక్సిక్ మూవీ మార్చి 19 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొద్ది రోజుల క్రితం ఈ మూవీ లో హీరో యష్ పాత్ర రయా ను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ విడుదల చేసిన వీడియో ఒకటి దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే. దీనికి ప్రధాన కారణం ఇందులో ఉన్న బోల్డ్ కంటెంటే. ఈ వీడియో పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు సెన్సార్ బోర్డు సైతం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీనికి తాము ఆమోదం తెలపలేదు...ఇది తమ దగ్గరకు రాలేదు అని ప్రకటించారు అప్పటిలో.

సినిమా విడుదల తేదీ దగ్గరకు వస్తుండంతో చిత్ర యూనిట్ ఈ మూవీ టీజర్ విడుదల తేదీ ప్రకటించింది. టాక్సిక్ టీజర్ శుక్రవారం నాడు అంటే ఫిబ్రవరి 20 ఉదయం 9 .35 గంటలకు విడుదల చేయనున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ టీజర్ అనౌన్స్‌మెంట్‌కు సంబంధించిన యష్ న్యూ లుక్ తో ఒక పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార, హ్యుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.

Next Story
Share it