Telugu Gateway
Cinema

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్
X

ఈ సంక్రాంతికి భారీ అంచనాలతో బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చిన సినిమాల్లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమా రాజాసాబ్ ఒకటి. అందరి కంటే ముందు జనవరి తొమ్మిదిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. గత కొన్ని సంవత్సరాలుగా వరసగా ఓన్లీ యాక్షన్ సినిమాలు చేస్తూ వస్తున్న ప్రభాస్ సడన్ గా హారర్ కామెడీ జానర్ లో మారుతీ దర్శకత్వంలో సినిమా ప్రకటించినప్పుడే అంతా ఒకింత అవాక్కు అయ్యారు. ఫలితం కూడా అలాగే వచ్చింది. సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల్లో ఒక్క రాజాసాబ్ సినిమాకు తప్ప మిగిలిన అన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ రావటంతో ఈ ప్రభావం కూడా రాజాసాబ్ కలెక్షన్స్ పై భారీగానే పడింది.

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లోకి వస్తోంది. రాజాసాబ్ మూవీ ఫిబ్రవరి తొమ్మిది నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జియో హాట్ స్టార్ అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ ను పెట్టారు. అయితే ఇందులో కాస్త ప్రాధాన్యత దక్కింది మాత్రం మాళవిక మోహనన్, నిధి అగార్వల్ కు మాత్రమే అని చెప్పొచ్చు. మూడవ హీరోయిన్ రిద్దీ కుమార్ కు సరైన ప్రాధాన్యత దక్కలేదు. నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నా ఫలితం మాత్రం తీవ్ర నిరాశకు గురిచేసింది అనే చెప్పాలి.

Next Story
Share it