అధికారిక ప్రకటన చేసిన నిర్మాణ సంస్థ

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. సంక్రాంతి సందర్బంగా ఆయన నుంచి మరో కొత్త సినిమా ప్రకటన వచ్చింది. అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ తో కలిసి ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా దీపికా పాడుకొనే తో పాటు జాన్వీ కపూర్ కూడా నటిస్తోంది. సన్ పిక్చర్స్ ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తోంది. ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా సాగుతున్నట్లు చెపుతున్నారు. అట్లీ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఛాన్స్ ఎవరికీ ఇస్తారు అన్న అంశంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. వీటి అన్నిటికి చెక్ పెడుతూ కొత్త సినిమా ప్రకటన భోగి రోజు అంటే జనవరి 14 న వెలువడింది. ఈ కొత్త మూవీ కూడా మరో తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తో కలిసి చేయనున్నారు. ఈ మూవీ ని నిర్మిస్తున్నది మైత్రి మూవీ మేకర్స్. లోకేశ్ కనగరాజ్ తనదైన మార్క్‌తో ఈ సినిమా రూపొందనున్నట్లు ఒక వీడియోను రిలీజ్ చేశారు. అనిరుధ్ రవిచందర్ ఈ అనౌన్స్‌మెంట్ వీడియోకు అదిరిపోయే సాలిడ్ మ్యూజిక్ ఇచ్చారు.



