అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన అడివి శేష్ మూవీ డెకాయిట్. ఏప్రిల్ 10 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా అడివి శేష్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. అయితే మొత్తం వసూళ్ల పరంగా చూసుకుంటే ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది అని టాలీవుడ్ వర్గాల అంచనా. అడివి శేష్, మృణాల ఠాకూర్ జంటగా నటించిన ఈ మూవీ ఇప్పుడు ఓటిటి లోకి వస్తోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.



