అదరగగొడుతున్న ప్రభాస్ డైలాగులు
'రాఘవుడు నన్ను పొందడానికి శివ ధనుస్సు విరిచాడు. ఇప్పుడు రావణుడి గర్వాన్ని కూడా విరిచేయాలి' అని సీతా దేవి చెప్పిన డైలాగ్, 'నా కోసం పోరాడకు. వేల సంవత్సరాల తర్వాత తల్లులు మీ వీరగాథను చెబుతూ పిల్లల్ని పెంచాలి. ఆ రోజు కోసం పోరాడండి. పోరాడతారా? అహంకారం రొమ్ము చీల్చి... ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి' అని శ్రీరాముని పాత్రలో ప్రభాస్ చెప్పే డైలాగ్ వింటుంటే.. గూస్ బంప్స్ రావడం పక్కా. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కి చేరుకున్నాయి.
ఖచ్చితంగా ఈ సినిమా ఇండియాన్ సినీ ఇండస్ట్రీలో ఒక మైలురాయిగా మిగిలిపోవడం ఖాయం అనే కామెంట్స్ వినిపోయిస్తున్నాయి. మరి రిలీజ్ తరువాత ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇది రాముడి కథ కావటంతో సహజంగానే ఈ సినిమా ను బీజేపీ కూడా ప్రమోట్ చేసే అవకాశం ఉంది అనే చర్చ సినీ వర్గాల్లో ఉంది. గత కొంత కాలంగా బీజేపీ కొన్ని ఎంపిక చేసిన సినిమాలను ప్రమోట్ చేస్తోంది. ఇప్పుడు కచ్చితంగా ఆదిపురుష్ ను బీజేపీ ఓన్ చేసుకుంటుంది అనే అభిప్రాయం ఉంది. అయితే సినిమా ఆసక్తికరంగా ఉంటే మాత్రం ఇది కొత్త రికార్డు లు సృష్టించటం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది