Telugu Gateway
Cinema

నెగిటివ్ టాక్ లోనూ దూసుకెళుతున్న ఆదిపురుష్

నెగిటివ్ టాక్ లోనూ దూసుకెళుతున్న ఆదిపురుష్
X

ఈ ఏడాది వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన సినిమా పఠాన్. షా రుఖ్ ఖాన్ నటించిన ఈ సినిమా విజయంతోనే బాలీవుడ్ మళ్ళీ ట్రాక్ లో పడినట్లు అయింది. ఇప్పుడు ఆ పఠాన్ రికార్డులను ఆదిపురుష్ తిరగరాస్తోంది. ఎన్ని వివాదాలు చుట్టుముడుతున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆదిపురుష్ సినిమా హవా కొనసాగుతూ ఉంది. రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 240 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. తొలి రోజు 140 కోట్ల రూపాయలు రాగా, రెండవ రోజు వంద కోట్ల రూపాయలు సాధించింది. దీంతో ఆదిపురుష్ ఈ ఏడాది జనవరి లో విడుదల అయిన పఠాన్ రికార్డ్స్ ను అధిగమించింది. పఠాన్ రెండు రోజులకుగాను ప్రపంచ వ్యాప్తంగా 219 కోట్ల రూపాయల వసూళ్లు మాత్రమే సాధించింది. ఆదివారం కూడా కలెక్షన్స్ బాగానే ఉన్నట్లు చెపుతున్నారు.

వివాదాల నేపథ్యంలో ఆదిపురుష్ చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటి అంటే హనుమంతుడితో పలికించిన డైలాగ్స్ పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతుండటంతో వాటిలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వెంటనే మార్పులు చేసి..సినిమాను ప్రదర్శిస్తామని తెలిపారు. హనుమంతుడి డైలాగ్స్ పై విమర్శలు ఏ మాత్రం ఆగకపోవటం చిత్ర యూనిట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తమకు ప్రేక్షుకుల మనోభావాలే ముఖ్యం అంటూ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది అంతా ఒకెత్తు అయితే ఇంత నెగిటివ్ టాక్ వచ్చిన సినిమా కు కూడా ప్రభాస్ రెండు రోజుల్లో 240 కోట్ల రూపాయల వసూళ్లు సాధించాడు అంటే అది తమ హీరో సత్తా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెడుతున్నారు.

Next Story
Share it