Telugu Gateway
Cinema

పెళ్లి ఆపేస్తున్న‌ట్లు మెహ‌రీన్ ప్ర‌క‌ట‌న‌

పెళ్లి ఆపేస్తున్న‌ట్లు మెహ‌రీన్ ప్ర‌క‌ట‌న‌
X

టాలీవుడ్ హీరోయిన్ మెహ‌రీన్ ఫిర్జాదా సంచ‌లన ప్ర‌క‌ట‌న చేసింది. కొద్ది రోజుల క్రితం ఆమె భ‌వ్య బిష్ణోయ్ తో ఎంగేజ్ మెంట్ చేసుకుని వివాహ‌నికి రెడీ అయింది. అయితే ఆమె శ‌నివారం నాడు పెళ్ళి కి గుడ్ బై చెబుతున్నాన‌ని..ఈ నిర్ణ‌యాన్ని ప‌రస్ప‌ర ప్ర‌యోజ‌నాల కోసం సామ‌ర‌స్యంగా తీసుకున్న‌ట్లు త‌న ప్ర‌క‌ట‌నలో వెల్ల‌డించారు. ఇక నుంచి భ‌విష్య‌త్ లో భ‌వ్య బిష్ణోయ్ తో ఎలాంటి సంబంధాలు ఉండ‌వ‌న్నారు.

ఆయ‌న‌తోపాటు ఆయ‌న కుటుంబ స‌భ్యులు, స్నేహితుల‌తో కూడా సంబంధాలు ఉండ‌వ‌న్నారు. ఈ మేర‌కే తాను ప్ర‌క‌ట‌న‌లో చెప్ప‌ద‌ల‌చుకున్నాన‌ని..త‌న వ్య‌క్తిగత స్వేచ్చ‌ను గౌర‌విస్తాన‌ని..ఇది పూర్తిగా ప్రైవేట్ వ్య‌వ‌హారం అన్నారు. రాబోయే రోజుల్లో త‌న ప్రాజెక్టుల‌తో ముందుకు వెళ‌తాన‌న్నారు. భ‌వ్య బిష్ణోయ్ హ‌ర్యానా మాజీ ముఖ్య‌మంత్రి భ‌జ‌న‌లాల్ మ‌న‌వ‌డు. ఇదిలా ఉంటే మెహ‌రీన్ ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఎఫ్ 3 సినిమాలో న‌టిస్తున్నారు.

Next Story
Share it