అంజలి...ఏరియల్ యోగా
BY Admin25 July 2021 6:46 AM GMT
X
Admin25 July 2021 6:46 AM GMT
ఈ స్టిల్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. సెలబ్రిటీలు ముఖ్యంగా హీరోయిన్లు తమ ఫిట్ నెస్ కాపాడుకోవటానికి నానా కష్టాలు పడుతుంటారు. నిత్యం జిమ్ లో గంటలకు గంటలు ఎక్సర్ సైజులు చేయటంతోపాటు యోగా కూడా సాధన చేస్తారు. టాలీవుడ్ హీరోయిన్ అంజలి తాను చేస్తున్న ఏరియల్ యోగాకు సంబంధించిన ఈ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఏరియల్ యోగాతో ఎలా అంటే అలా మారగలనని..అందుకే తనకేమీ కాదన్నారు.
ఆరోగ్యకర జీవన విధానానికి ఇది చాలా ముఖ్యమన్నారు. అంజలి ఈ మధ్య పవన్ కళ్యాణ్ తో కలసి వకీల్ సాబ్ సినిమాలో కన్పించిన విషయం తెలిసిందే. అయితే అంజలి ఎన్ని సినిమాలు చేసినా సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా మాత్రం ఆమె కెరీర్ లోనే మర్చిపోలేని సినిమాగా మిగులుతుందనటంలో సందేహం లేదు.
Next Story