Telugu Gateway
Cinema

క‌మాండ‌ర్ అండ్ కామ్రెడ్

క‌మాండ‌ర్ అండ్ కామ్రెడ్
X

ఈ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన నాగ‌బాబు క‌మాండ‌ర్..కామ్రెడ్ దాడి చేయ‌టానికి రెడీ కాబోతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి అయిన‌ట్లు స‌మాచారం. రెండు పాట‌లు మాత్రమే ఇంకా షూట్ చేయాల్సి ఉంది. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కూడా కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా పూజా హెగ్డె న‌టిస్తుంటే..చిరంజీవికి జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

ఇప్ప‌టికే భారీ ప్రాజెక్టులు అన్నీ వ‌ర‌స పెట్టి షెడ్యూల్స్ బుక్ చేసుకుంటూ పోతున్నాయి. అందులో భాగంగా సంక్రాంతికి భారీ సంద‌డి ఉండ‌బోతుంది. ద‌స‌రాలోనూ ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలో హంగామా న‌డ‌వ‌నున్న విషయం తెలిసిందే. పుష్ప తొలి పార్ట్ ను కూడా క్రిస్మ‌స్ కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వాస్త‌వానికి క‌రోనా రెండ‌వ ద‌శ కార‌ణంగా ప‌లు ప్రాజెక్టులు అన్నీ ప‌ట్టాలు త‌ప్పాయి.

Next Story
Share it