ఆచార్య ట్రైలర్ వస్తోంది
BY Admin9 April 2022 1:54 PM GMT

X
Admin9 April 2022 1:54 PM GMT
చిరంజీవి, రామ్ చరణ్ లు నటించిన ఆచార్య సినిమా ట్రైలర్ ఏప్రిల్ 12న విడుదల కానుంది. చిత్ర యూనిట్ ఈ విషయాన్ని శనివరం నాడు స్పెషల్ లుక్ విడుదల ద్వారా ప్రకటించింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తే..రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డె నటించిన విషయం తెలిసిందే. పలుమార్లు వాయిదాల అనంతరం ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా విడుదల తేదీ దగ్గరకు వస్తుండటంతో ఇక ప్రమోషన్ కార్యక్రమాల వేగం పెరగనుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలసి నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ మార్చిలో విడుదల కాగా..ఆ వెంటనే అంటే ఏప్రిల్ లో ఆచార్య సినిమా వస్తుండటంతో ఛరణ్ ఫ్యాన్స్ ఫుల్ కుషీగా ఉన్నారు.
Next Story