అదరగొడుతున్న ఆచార్య ట్రైలర్

దివ్యవనం ఒక వైపు..తీర్థజలం ఒక వైపు. నడుమ పాదఘట్టం..అంటూ రామ్ చరణ్ వాయిస్ తో ప్రారంభం అవుతుంది ఆచార్య ట్రైలర్. పాదఘట్టం వాళ్ళ గుండెలపై కాలు వేస్తే కాళ్ళు తీసేయాలంట అంటూ చిరంజీవి పవర్ ఫుల్ డైలాగ్ తో ఎంట్రీ ఇస్తాడు. సిద్ధా తెలుసా నీకు అంటూ తనికెళ్ళ భరణి చిరంజీవిని ప్రశ్నించగానే..కామ్రెడ్ అంటూ చిరంజీవి పిలవటం..రామ్ చరణ్ రాక ట్రైలర్ లో హైలెట్ గా నిలుస్తాయి. ఈ సినిమాలో సోనూసూద్ విలన్ గా నటించారు. ట్రైలర్ లోని యాక్షన్ సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచాయి. చిత్ర యూనిట్ ముందు ప్రకటించినట్లుగానే మంగళవారం సాయంత్రం సోషల్ మీడియా వేదికగా..రాష్ట్ర వ్యాప్తంగా 152 థియేటర్లలో కూడా ఆచార్య ట్రైలర్ విడుదల చేశారు.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ లు నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డె నటిస్తుంటే..చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటించారు. ఏప్రిల్ 29న సినిమా విడుదలకు ముహుర్తం నిర్ణయించటంతో ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తూ 'సిద్ధ' అనే కీలక పాత్రలో కన్పించనున్నాడు.