Telugu Gateway
Cinema

ఆచార్య టీజర్ జనవరి 29న

ఆచార్య టీజర్ జనవరి 29న
X

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా 'ఆచార్య'. ఇందులో రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. రామ్ చరణ్ పాత్రను సిద్ధగా దర్శకుడు కొరటాల శివ పరిచయం చేశారు. బుధవారం నాడు ఈ సినిమా టీజర్ ను జనవరి 29న విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు కొరటాల శివ.

'ధర్మస్థలి తలుపులు జనవరి 29 సాయంత్రం 4.05 నిమిషాలకు తెరుచుకోనున్నాయి' అని వెల్లడించారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. చరణ్ సరసన పూజా హెగ్డె అని ప్రచారం జరుగుతోంది. ఇంకా దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ సినిమా నిర్మాతగా రామ్ చ రణ్ వ్యవహరిస్తున్నారు.

Next Story
Share it