Telugu Gateway
Cinema

ఆచార్య టీజ‌ర్ అదిరింది

ఆచార్య టీజ‌ర్ అదిరింది
X

ఒకే ఒక్క డైలాగ్. యాక్షన్ సీన్స్. ప‌లు ఆస‌క్తిక‌ర సీన్స్ తో ఆచార్య టీజ‌ర్ వ‌చ్చేసింది. 'ధ‌ర్మ‌స్థ‌లికి ఆప‌ద వ‌స్తే..అది జ‌యించ‌టానికి అమ్మోరు త‌ల్లే ఆవ‌హించి మ‌మ్మ‌ల్ని ముందుకు పంపుతుంది.' అంటూ ఈ సినిమాలో సిద్ధ పాత్ర పోషిస్తున్న రామ్ చ‌ర‌ణ్ డైలాగ్ తో టీజ‌ర్ క‌ట్ చేశారు. ఇందులో రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా పూజా హెగ్డె న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. టీజ‌ర్ చివ‌ర్లో ఓ కొల‌ను ద‌గ్గ‌ర ఓ ప‌క్క‌న రెండు పులులు క‌న్పిస్తుంటే..మ‌రో ప‌క్క‌న రామ్ చ‌ర‌ణ్ వెన‌కే చిరంజీవి వ‌చ్చి నిల‌బ‌డే సీన్ టీజ‌ర్ లో హైలెట్ గా నిలుస్తుంది.

ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తోంది. కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 4న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. యాక్షన్స్ సీన్ త‌ర‌హాలో పూజాహెగ్డె, రామ్ చ‌ర‌ణ్ ను ఆమెను ఎత్తుకుని..ఆ వెంట‌నే ఫైట్ సీన్ కు కనెక్ట్ చేసిన విధానం ఆక‌ట్టుకునేలా ఉంది. కొరటాల శివ చిరంజీవి కాంబినేష‌న్ సినిమా ఇదే మొద‌టిసారి. దేవాదాయ శాఖ‌కు సంబంధించిన అంశాల‌తో ఈ సినిమా తెర‌కెక్కించారు.

Next Story
Share it