Telugu Gateway
Cinema

'ఆచార్య‌' కొత్త అప్ డేట్ వ‌చ్చేసింది

ఆచార్య‌  కొత్త అప్ డేట్ వ‌చ్చేసింది
X

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ లు క‌ల‌సి న‌టిస్తున్న సినిమా 'ఆచార్య‌' . ఈ సినిమాలో వీరిద్ద‌రికి జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్, పూజా హెగ్డెలు న‌టిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి సెకండ్ సింగిల్ నీలాంబ‌రి లిరిక‌ల్ వీడియోను న‌వంబ‌ర్ 5న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

దీనికి సంబంధించి లుక్ ను కూడా విడుద‌ల చేశారు. దీనిపై పూజాహెగ్డె స్పందిస్తూ..'నేను హామీ ఇస్తున్నా. ఈ పాట విజువ‌ల్స్, మ‌ణిశ‌ర్మ అందించిన మెలోడీతో మీకు పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ‌తారు' అని పేర్కొంది. కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా వ‌చ్చే ఫిబ్ర‌వ‌రి 4న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

Next Story
Share it