Telugu Gateway
Cinema

'ఆచార్య' నీలాంబ‌రి ఫుల్ సాంగ్ వచ్చేసింది

ఆచార్య నీలాంబ‌రి ఫుల్ సాంగ్ వచ్చేసింది
X

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌రణ్ లు క‌ల‌సి న‌టిస్తున్న సినిమా 'ఆచార్య' . ఇందులో రామ్ చ‌ర‌ణ్ సిద్ధ‌ప్ప‌గా సంద‌డి చేయ‌నున్నారు. రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డెల‌కు సంబంధించి 'నీలాంబరి .. నీలాంబరి .. వేరెవ్వరే నీలామరి, అయ్యోరింటి సుందరి .. వయ్యారాల వల్లరి .. నీలాంబరి' అంటూ సాగే పూర్తి లిరిక‌ల్ సాంగ్ ను చిత్ర యూనిట్ శుక్ర‌వారం నాడు విడుద‌ల చేసింది. మణిశర్మ స్వరపరిచిన ఈ పాటకి, అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించాడు. అనురాగ్ కులకర్ణి - రమ్య బెహ్రా ఆలపించారు. దీపావళి సందర్భంగా ఈ సాంగ్‌ ప్రోమోను విడుదల చేస్తూ ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌ నేడు విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ధర్మస్థలి కేంద్రంగా ఓ కామ్రేడ్‌ చేసిన పోరు నేపథ్యంలో సాగే కథ ఇది. మెగాస్టార్‌ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోంది ఈ సినిమా.కొణిదెల ప్రొడక్షన్స్‌లో నిరంజన్‌ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story
Share it