'ఆచార్య' విడుదల కూడా మారింది
BY Admin31 Jan 2022 6:32 PM IST
X
Admin31 Jan 2022 6:32 PM IST
టాలీవుడ్ లో భారీ సినిమాలు అన్నీ రీ షెడ్యూల్ అవుతున్నాయి. తొలుత ఆర్ఆర్ఆర్ సినిమాను మార్చి 18న అని చెప్పి..ఇప్పుడు మార్చి 25కి మార్చారు. ఆచార్య తేదీ కూడా అలాగే మారింది. ఆచార్య సినిమాను చిత్ర యూనిట్ ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్లు ఇంతకు ముందు ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ తో జరిగిన అర్ధవంతమైన చర్చలు..పరస్పర అంగీకారం మేరకు ఆచార్య సినిమాను ఏప్రిల్ 29కి మార్చారు. ఈ మేరకు చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం ఓ అప్ డేట్ ఇచ్చింది.
Next Story