'ఆచార్య' ఏప్రిల్ 1న విడుదల
BY Admin16 Jan 2022 10:29 AM IST
X
Admin16 Jan 2022 10:29 AM IST
వాయిదా ప్రకటన చేసిన మరుసటి రోజే 'ఆచార్య' చిత్ర యూనిట్ కొత్త విడుదల తేదీని వెల్లడించింది. ఏప్రిల్ 1న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ లు నటించిన విషయం తెలిసిందే. వీరికి జోడీగా కాజల్ అగర్వాల్, పూజా హెగ్డెలు నటించారు. చిరంజీవి న్యూలుక్ తో విడుదల తేదీని వెల్లడించింది చిత్ర యూనిట్. ఇప్పటికే విడుదలైన ఈసినిమాలోని పాటలు మంచి ఆదరణ పొందాయి. అంటే ఈ సారి వేసవి బరి కొత్త సినిమాలో పోటీతో మరింత వేడెక్కేలా కన్పిస్తోంది. కరోనా కారణంగా వాయిదా పడిన సినిమాలు అన్నీ తమకు అనువైన తేదీలను అన్వేషించుకునే పనిలో ఉన్నాయి.
Next Story