తుపాకులు పట్టుకుని బయలుదేరిన చిరు..చరణ్
BY Admin27 March 2021 4:18 AM GMT

X
Admin27 March 2021 4:18 AM GMT
'ఆచార్య' సినిమా నుంచి కొత్త లుక్ విడుదల అయింది. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ ఫోటోను విడుదల చేసింది. ఆచార్య సినిమా నక్సల్స్ కు సంబంధించిన అంశమే అని ఇటీవల మెగాస్టార్ చిరంజీవి బహిర్గతం చేశారు. న్యూలు క్ లోనూ చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ తుఫాకులు పట్టుకుని బయలుదేరిన లుక్ అభిమానులను అలరిస్తోంది.
సందేశాత్మక చిత్రాలు తీస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్న దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. రామ్ చరణ్ పాత్ర 'సిద్ధ' అని ఇప్పటికే బహిర్గతం చేశారు.
Next Story