'ఆచార్య' టీజర్ నవంబర్ 28న
BY Admin24 Nov 2021 10:57 AM GMT

X
Admin24 Nov 2021 10:57 AM GMT
చిరంజీవి సినిమా అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డెలు నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆచార్య టీజర్ ను నవంబర్ 28న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇప్పటికే విడుదలైన ఆచార్య పాటలకు మంచి ఆదరణ దక్కింది. ఆచార్య సినిమాను ఫిబ్రవరి 04, 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శకనిర్మాతలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
Next Story