Telugu Gateway
Cinema

ఆయ్ కూడా అదే డేట్ లో

ఆయ్ కూడా అదే డేట్ లో
X

గత నెలలో భారీ అంచనాల మధ్య విడుదల అయిన మిడ్ రేంజ్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టాయి. ఇందులో రవి తేజ మిస్టర్ బచ్చన్ ఒకటి అయితే...రెండవది రామ్ నటించిన డబుల్ ఇస్మార్ట్. ఈ రెండు సినిమాలను తెరకెక్కించింది కూడా పేరున్న దర్శకులు హరీష్ శంకర్, పూరి జగన్నాథ్. వీటితో పాటు ఏ మాత్రం అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఆయ్. నార్నె నితిన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధించింది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఏ మూవీ ప్రపంచ వ్యాప్తంగా దగ్గర దగ్గర పదిహేను కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది.

ఇప్పుడు ఈ సినిమా ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకుంది. థియేటర్ల లో మిస్టర్ బచ్చన్ కు పోటీ ఇచ్చిన ఈ సినిమా ఓటిటి లో అదే రోజు అంటే మిస్టర్ బచ్చన్ స్ట్రీమింగ్ అయ్యే సెప్టెంబర్ 12 వ తేదీనే ఎంచుకుంది. మరో కీలక విషయం ఏమిటి అంటే ఈ రెండు సినిమాలు నెట్ ఫ్లిక్స్ లోనే రానున్నాయి. మరి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఫలితాలను సాధించిన ఆయ్ కు ఎక్కువ ఆదరణ దక్కుతుందా..హీరో ..హీరోయిన్ పరంగా ఎంతో హైప్ దక్కించుకున్న మిస్టర్ బచ్చన్ ముందు వరసలో ఉంటుందా అన్నది వేచిచూడాల్సిందే. మరో కీలక విషయం ఏమిటి అంటే ఆయ్ కు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇది కూడా ఓటిటి రన్ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది.

Next Story
Share it