'30 రోజుల్లో ప్రేమించటం ఎలా' ట్రైలర్ వచ్చేసింది
BY Admin21 Jan 2021 2:40 PM GMT
X
Admin21 Jan 2021 2:40 PM GMT
'నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా' పాటతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇదొక్కటే కాదు ఇతర పాటలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' విడుదల తేదీ ఖరారు అయింది. జనవరి 29న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. సినిమా విడుదల తేదీ ఖరారు కావటంతో చిత్ర యూనిట్ గురువారం నాడు థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసింది.
ట్రైలర్ కూడా సినిమా ఎంత సందడిగా ఉండబోతుందో శాంపిల్ చూపించినట్లు అయింది. పాట అంత బాగుంటుంది సినిమా అని ట్రైలర్ ను ముగించారు. నువ్వు వదిలే ఊపిరి పీల్చుకుంటే ఎంత బాగుందే అన్న హీరో డైలాగ్‌తో ట్రైలర్ మొదలయింది. ఇందులో ప్రదీప్ ఓవైపు గ్రామీణ యువకుడిగా కనిపిస్తూనే మరోవైపు కాలేజీ కుర్రాడిగా రెండు రకాల పాత్రలు చేశాడు.
Next Story