'నాకు తెలియని ఒక అమ్మాయి ఎప్పుడూ ఓ విషయం చెబుతూ ఉండేది. ప్రేమించటానికి రీజన్ ఉండకూడదు. ఎందుకు ప్రేమించాం అంటే అన్సర్ అండకూడదు.' ఇదీ నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న 18 పేజీస్ సినిమా గ్లింప్స్ లోని డైలాగ్. చిత్ర యూనిట్ బుధవారం సాయంత్రం ఈ గ్లింప్స్ ను విడుదల చేసింది. ఈ వేసవిలోనే సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. గ్లింప్స్ ను చూస్తే ఇది డైరీ ఆధారిత ప్రేమ కథలాగా కన్పిస్తోంది.ఈ సినిమాకు సుకుమార్ రైటింగ్స్ కథ అందించగా..సూర్యప్రతాప్ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది.