Telugu Gateway
Cinema

డిఫ‌రెంట్ గా 18 పేజీస్ ఫ‌స్ట్ లుక్

డిఫ‌రెంట్ గా 18 పేజీస్ ఫ‌స్ట్ లుక్
X

హీరో నిఖిల్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేసింది. ఈ సినిమాలో నిఖిల్ కు జోడీగా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తోంది. నిఖిల్ క‌ళ్ల‌కు ఓ పేప‌ర్ అంటించి ఉంటే దానిపై పెన్నుతో అనుప‌మ ఏదో రాస్తూ ఉంది ఇందులో. ఈ లుక్ ను ఆమె కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. దీని కింద ప‌లు ఆస‌క్తిక‌ర అంశాల‌ను ప్ర‌స్తావించారు. నా పేరు నందిని. నాకు మొబైల్ లో లెట‌ర్స్ టైప్ చేయ‌టం క‌న్నా ఇలా కాగితంపై రాయ‌టం ఇష్టం.

టైప్ చేసే లెట‌ర్స్ కు ఎమోష‌న్స్ ఉండ‌వు. ఎవ‌రు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి. కానీ రాసే ప్ర‌తి లెట‌ర్ కూ ఒక ఫీలింగ్ ఉంటుంది. దానిపై నీ సంత‌కం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్ప‌ట‌మే బాగుంది అంటూ రాసుకొచ్చింది అనుప‌మ‌. ఈ సినిమాకు సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను అల్లు అర‌వింద్ స‌మ‌ర్పిస్తున్నారు.

Next Story
Share it