Telugu Gateway

శ్రీవ‌ల్లి సాంగ్ ప్రొమో విడుద‌ల‌

శ్రీవ‌ల్లి సాంగ్ ప్రొమో విడుద‌ల‌
X

'పుష్ప‌' సినిమాకు సంబంధించి సెకండ్ సింగిల్ బుధ‌వారం నాడు విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ పాట ప్రొమోను మంగ‌ళ‌వారం నాడు విడుద‌ల చేసింది. చూపే బంగారమాయేనే శ్రీవ‌ల్లి..నీ మాటే మాణిక్య‌మాయేనే అంటూ పాట సాగ‌నుంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన దాక్కో దాక్కో మేక‌..పులొచ్చి కొరుకుద్ది పీక పాట దుమ్మురేపిన విష‌యం తెలిసిందే.

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇది సుకుమార్, అల్లు అర్జున్ ల హ్యాట్రిక్ మూవీ. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబ‌ర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ గా పూర్తి మాస్ లుక్ లో అల‌రించ‌నున్నాడు.

Next Story
Share it