Telugu Gateway
Telugugateway Exclusives

అందమైన మహిళలు..అబ్బాయిలను ముద్దుపెట్టుకుంటా

అందమైన మహిళలు..అబ్బాయిలను ముద్దుపెట్టుకుంటా
X

'నేను ఇప్పుడు అత్యంత శక్తివంతంగా ఉన్నా. అలా నడిచి వెళ్లి ప్రేక్షకుల్లో అందరినీ ముద్దుపెట్టుకోగలను. అబ్బాయిలు..అందమైన మహిళలను ముద్దుపెట్టుకుంటా' అని వ్యాఖ్యానించారు. అమెరికాలోని ఫ్లోరిడా ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను పూర్తి రోగనిరోధక శక్తి కలిగిఉన్నట్లు వ్యాఖ్యానించారు. ట్రంప్ కు కరోనా నెగిటివ్ అని తేలిందని వైట్ హౌస్ ప్రకటన చేసిన తర్వాత ట్రంప్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ వారంలో మొత్తం ట్రంప్ ఆరు ఎన్నికల ర్యాలీలను తలపెట్టారు. ఎలాంటి రక్షణ మాస్క్ లేకుండా ట్రంప్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ట్రంప్ అభిమానులు కూడా ఎలాంటి మాస్క్ లు లేకుండానే భుజం భుజం కలిపి ర్యాలీల్లో పాల్గొన్నారు. నవంబర్ 3 ఎన్నికల సమయం దగ్గర పడటంతో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు మరింత వేడెక్కాయి.

కరోనా వైరస్ అంశం ఈ ఎన్నికల్లో ట్రంప్ పై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. అయినా సరే ట్రంప్ మాత్రం అదేమీ లెక్కచేయకుండా తన పాత ధోరణితోనే వెళుతున్నారు.. ఇప్పటికే అమెరికాలో 78 లక్షల మంది కరోనా వైరస్ బారిన పడగా, 2.14 లక్షల మందికి పైగా కరోనా కారణంగా మరణించారు. కరోనా వైరస్ నుంచి రక్షణ కోసం పెట్టిన లాక్ డౌన్లు ఆర్ధిక వ్యవస్థకు తీరని నష్టం చేశాయని పేర్కొన్నారు. ట్రంప్ తీరుపై ఎన్ని విమర్శలు వస్తున్నా ఆయన మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన వైఖరిని కొనసాగిస్తూ ప్రచారం చేస్తున్నారు.

Next Story
Share it