టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డికి కరోనా
BY Admin15 Oct 2020 10:15 AM IST
X
Admin15 Oct 2020 10:15 AM IST
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్ వై వీ సుబ్బారెడ్డి కరోనా బారిన పడ్డారు. ఆయనకు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. తిరుమలలో ఇటీవల వరకూ పెద్ద ఎత్తున కరోనా కేసులు వెలుగుచూసిన విషయం తెలిసిందే. కరోనా ఉధృతిని దృష్టిలో పెట్టుకునే బ్రహ్మోత్సవాలను కూడా ఏకాంతంగా నిర్వహించాలనే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నెల 16 నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
Next Story