Telugu Gateway
Andhra Pradesh

మూడు మద్యం బాటిళ్ళు తెచ్చుకోవటం ఇక చెల్లదు

మూడు మద్యం బాటిళ్ళు తెచ్చుకోవటం ఇక చెల్లదు
X

ఏపీలో మద్యం రేట్లు ఎక్కువగా ఉన్నాయని చాలా మంది పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్ళు తెచ్చుకుంటున్నారు. ఇఫ్పటివరకూ మూడు బాటిళ్లు తెచ్చుకునేందుకు అనుమతి ఉంది. వాస్తవానికి ప్రభుత్వం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసి కొంత మందిని అరెస్ట్ కూడా చేసింది. అయితే మందుబాబులు కోర్టుకు వెళ్ళి మరి అనుమతి తెచ్చుకున్నారు. దీంతో సర్కారు ఇప్పుడు కొత్త జీవోను తీసుకొచ్చి మూడు బాటిళ్లు తెచ్చుకునే వెసులుబాటుకు బ్రేక్ లు వేసింది. ఏపీలో మందు బాబులు కోరుకునే బ్రాండ్లు లేకపోటం ఒకటి అయితే..ఉన్న బ్రాండ్ల రేట్లు మరీ ఎక్కువగా ఉండటం విమర్శలకు తావిస్తోంది.

అయినా సరే ప్రభుత్వం మాత్రం మద్యనియంత్రణ కోసమే రేట్లు పెంచినట్లు చెబుతూ వస్తోంది. సోమవారం నాడు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవటాన్ని నిషేధిస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. పర్మిట్లు, లైసెన్స్‌ లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవటంపై ఏపీ ఎక్సైజ్‌ శాఖ నూతన జీవో విడుదల చేసింది. దీంతో మూడు బాటిల్స్‌ తెచ్చుకునేందుకు కూడా ఇక నుంచి అనుమతి లేదు. పర్మిట్ లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెస్తే 1968 ఏపీ ఎక్సైజ్ చట్టం ద్వారా శిక్షార్హులు అవుతారు. ఈ మేరకు జీవో నెంబర్ 310ని ఎక్సైజ్ శాఖ విడుదల చేసింది. ఇతర దేశాల నుంచి మద్యం తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతి ఇచ్చింది.

Next Story
Share it