Telugu Gateway
Andhra Pradesh

తెలుగుదేశం పార్టీకి..ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టు నోటీసులు

తెలుగుదేశం పార్టీకి..ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టు నోటీసులు
X

తెలుగుదేశం పార్టీ మంగళగిరి కార్యాలయం వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరిలో టీడీపీ కార్యాలయానికి భూ కేటాయింపులపై సుప్రీంలో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి జరిపిన భూ కేటాయింపులను రద్దు చేయాలని పిటిషనర్‌ కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ నారిమన్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ ఆర్కే తరపున న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, రమేష్ వాదనలు వినిపించారు.

టీడీపీ, ఏపీ ప్రభుత్వం, సీఆర్‌డీఏకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు మూడు వారాల తర్వాత చేపట్టనుంది. గతంలో ఇదే అంశంపై ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించగా..హైకోర్టు ఈ పిటీషన్ ను కొట్టివేసింది. హైకోర్టు ఉత్తార్వులను సవాల్‌ చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Next Story
Share it