ఆ పత్రాలపై సీఎం ఫోటో తొలగించండి
BY Admin29 Jan 2021 10:13 AM IST
X
Admin29 Jan 2021 10:13 AM IST
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జారీ చేసే ధృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి ఫోటో ముద్రించటం తగదని సీఎస్ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ కు లేఖ రాశారు. కుల ధృవీకరణ పత్రాలు, ఎన్వోసీల మీద సీఎం జగన్ ఫొటోను తొలగించాలని ఆదేశించారు.
అభ్యర్ధులకు తాసీల్దార్లు జారీ చేసే కుల ధృవీకరణ పత్రాలు, ఎన్వోసీలపై సీఎం జగన్ ఫొటో ఉండడం ఎన్నికల నియామవళికి విరుద్దమని తెలిపారు. ఈ మేరకు తాసీల్దార్లకు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా సీఎస్ కు ఎస్ఈసీ సూచించారు. కుల ధృవీకరణ పత్రాలు, ఎన్వోసీల జారీలో వివక్ష, జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
Next Story