Telugu Gateway
Andhra Pradesh

జగన్ కేసులకు భయపడే వ్యక్తి కాదు

జగన్ కేసులకు భయపడే వ్యక్తి కాదు
X

సీఎం జగన్ ఓ వ్యక్తికాదని..ఆయన ఓ వ్యవస్థ అని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. జగన్ దేశంలోనే అత్యంత శక్తివంతమైన సోనియాగాంధీనే ఎదిరించిన వ్యక్తి అని ..అలాంటి జగన్ కేసులకు భయపడతారా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ముఖ్యమంత్రి కేసులకు భయపడే వ్యక్తి కాదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు'' పోలవరం విషయంలో ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయలేదు.

సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించైనా పోలవరాన్ని పూర్తి చేస్తాం. సీఎం జగన్‌ను ఉండవల్లి నువ్వు అని సంబోధించడం సరికాదు. మీకు చెప్పే స్థాయి కాదు.. మీ పై ఉన్న గౌరవంతో మాత్రమే మాట్లాడుతున్నాను. టీడీపీ హయాంలో పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నారని ప్రధాని మోదీయే వ్యాఖ్యానించారు. ముంపు ప్రాంత వాసులకు పరిహారం, ఆర్ అండ్ ఆర్ త్వరితగతిన పూర్తి చేసి పోలవరం విషయంలో ముందుకు వెళ్తా'' మన్నారు.

Next Story
Share it