Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో కొత్త పవర్ బ్రోకర్!

ఏపీలో కొత్త పవర్ బ్రోకర్!
X

ఆయన ఒకప్పుడు సాదా సీదా రియల్ ఎస్టేట్ వ్యాపారి. తర్వాత తర్వాత వివిధ రంగాల్లోకి విస్తరించాడు. మధ్యలో ఎవరూ ఊహించని రీతిలో గాలిలోకి కూడా ఎగిరి మళ్ళీ అంతే వేగంగా కిందకు వచ్చాడు. చాలా రోజులు గడ్డు కాలాన్ని ఎదురుకున్నాడు. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి సర్కారు అధికారంలోకి రావటంతో మళ్ళీ అతగాడి హవా మళ్ళీ మొదలైంది. ఏకంగా ఒక పార్టీకి బినామీగా వ్యవహరిస్తున్నాడు అనే ప్రచారం ఉంది. అంటే కాదు..ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం క్లియర్ చేసిన పలు విద్యుత్ ప్రాజెక్ట్ ల్లో కూడా ఈ బినామీ వ్యక్తి కి చెందిన పలు పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ల వెనక ఉన్నది కూడా ఆ పార్టీ చెందిన కీలక వ్యక్తులేనా అన్న అనుమానాలు కూడా అధికార వర్గాల్లో ఉన్నాయి. ఎందుకంటే ఆయనకు సొంతగా అంత పెట్టుబడు పెట్టె సామర్థ్యం లేదు. ఈ ప్రాజెక్ట్ ల వివరాలు కూడా తర్వలోనే ఆధారాలతో సహా బయటికి వచ్చే అవకాశం ఉంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక పార్టీ సంపాదిస్తున్న సొమ్మును ఆయనే వివిధ రకాల ప్రాజెక్ట్ ల్లో పెట్టుబడులు పెడుతూ వాళ్లకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు చెపుతున్నారు. దీని వెనక భారీ ఎత్తున గోల్ మాల్ జరుగుతున్నట్లు కనిపిస్తోంది అనే అభిప్రాయం అధికార వర్గాల్లో ఉంది. అందుకే ఆ పార్టీ నేతలు కీలక విషాయాల్లో మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ సదరు వ్యక్తికి ఒక పార్టీ కి చెందిన ఇద్దరు కీలక నేతలు అత్యంత సన్నిహితులు. వాళ్ళు ఇద్దరూ తాను ఏది చెపితే అదే అన్నట్లు కూడా ఆయన బయట ప్రచారం చేసుకుంటున్నట్లు కూడా అధికార వర్గాలు చెపుతున్నాయి.

రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటి నుంచి ఆయన హంగామా చూసి అధికార వర్గాలు కూడా ఆశ్చర్యానికి గురి అవుతున్నాయి. అవసరం ఉంటే ఒకలా వ్యవహరించటం...అవసరం తీరిన తర్వాత కనీసం వాళ్ళ వైపు కన్నెత్తి చూడకపోవటం ఆయన నైజం. గతంలో బాగా పేరున్న ఒక కంపెనీ ని వందల కోట్ల రూపాయలకు ముంచినట్లు కూడా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఒక పార్టీ అండదండలతో రాబోయే రోజుల్లో ఎవరూ ఊహించని విధంగా ఎదిగేందుకు ఆయన స్కెచ్ సిద్ధం చేసుకున్నారు అని..ఇప్పటికే దీన్ని అమలు చేయటంలో ఆయన ఫుల్ బిజీ గా ఉన్నట్లు చెపుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ అధికార, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Next Story
Share it