జగన్ ఫేక్ ముఖ్యమంత్రి
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఏపీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 'జగన్ ఓ ఫేక్ ముఖ్యమంత్రి. సైకో అని అనుమానం వస్తుంది. వైసీపీ గాలికొచ్చింది. గాలికే పోతుంది. వరద నష్టంపై గాలి కబుర్లు చెబుతోంది. ప్రజలను మోసం చేస్తారా? అడిగితే ఎదురుదాడి చేస్తారా? అవమానిస్తారా? వాళ్లకు నేర చరిత్ర ఉంది. ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు. సభకు ఆలశ్యం వచ్చే ముఖంమమంత్రిని ఈయన్నే చూస్తున్నా. ప్రభుత్వ సమాదానం మోసపూరిత ప్రకటనలే. రామానాయుడు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి స్పందించే తీరు అదేనా. దీంతో నాకు కోపం వచ్చింది. అదేనా సీఎం తీరు. వెలికి నవ్వు. ఆ వెకిలి నవ్వుకు కోరస్. బీ కేర్ ఫుల్. చాలా మందిని చూశా. మంచి పనులు చేసి చరిత్రలో నిలవాలి. సభలో వైసీపీ నేతలు నీచంగా మాట్లాడుతున్నారు. టీడీపీ సభ్యులను అవమానిస్తున్నారు. సీఎం తీరుతోనే కోపం వచ్చి వెల్ లోకి తొలిసారి వెళ్లా. ప్రధాని మోడీ జినోమ్ వ్యాలికి రావటం గర్వకారణం. నా హయాంలోనే ఇది ప్రారంభం అయింది. హైటెక్ సిటీ కట్టా. మంచి పనులు చేస్తే చరిత్రలో నిలిచిపోతాం. అంతే కానీ..ఇదా పద్దతి. అమరావతిని నాశనం చేసి ఇంకా డ్రామాలు ఆడతారా? మీ ఉన్మాదానికి అంతు లేదా?. కావాలని ఇష్టానుసారం కేసులు పెట్టడం. పోలీసులను కూడా హెచ్చరిస్తున్నా.
కోర్టులు హెచ్చరించినా తీరు మార్చుకోవటం లేదు. ఇలాంటి దుష్టసంప్రదాయాలు ఎక్కడా లేవు. మా పోరాటం కొనసాగుతుంది. భవిష్యత్ లోనూ ఇలాగే పోరాటాన్ని కొనసాగిస్తాం. ఏమి చేస్తారు. నన్ను చంపేస్తారా? మీడియాను కూడా సభలోకి అనుమతించటం లేదు. మేం అధికారంలో ఉన్నప్పుడు సాక్షి విషయంలో అలా చేయలేదే. ఎవరు ఇచ్చారు మీకు అధికారం. నేను ఏమైనా చేస్తాను. చెలామణి అవుతుంది అనుకుంటున్నారా? ప్రజలు తగిన శాస్తి చేస్తారు. గౌరవం ఇచ్చిపుచ్చుకోవటం నేర్చుకోండి. రాష్ట్రంలో రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉంది. సీఎం జగన్ చేతకాని తనం, అసమర్ధత, అహం వల్ల రాష్ట్ర రైతాంగం నష్టపోతుంది. వారి ఉసురు తగులుతుంది. బీమా కట్టడంలో విఫలమవటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. వరికి 30 వేల రూపాయలు, ఉద్యానవన పంటలకు 50 వేల రూపాయలు అందించాలి. ప్రతి రోజూ అవమానాలు భరించాలా?' అంటూ ప్రశ్నించారు.