జె సీ బ్రదర్స్ హౌస్ అరెస్ట్
BY Admin4 Jan 2021 6:30 AM

X
Admin4 Jan 2021 6:30 AM
తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. తమపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారనే ఆరోపణలతో జె సీ ప్రభాకర్ రెడ్డి నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. దీంతో పట్టణంలో 144 సెక్షన్ విధించటంతోపాటు పోలీసులను భారీ ఎత్తున మొహరించారు. అయితే తాను తన ఇంట్లో అయినా దీక్షకు కూర్చుంటానని ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. అయితే జె సీ సోదలిద్దరిని బయటకు రాకుండా పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు.
అంతే కాదు..వారి వారి నివాసాలకు వెళ్ళే ప్రాంతాలను కూడా పూర్తిగా బ్లాక్ చేశారు. జె సీ సోదరులు ఇద్దరినీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎలాంటి గొడవలకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ పనిచేసినట్లు పోలీసులు చెబుతున్నారు. వాస్తవానికి తహశీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షకు కూర్చుంటామని ప్రకటించారు.
Next Story