Telugu Gateway
Andhra Pradesh

ఇన్ సైడర్ ట్రేడింగ్ కు ఐపీసీ సెక్షన్లు వర్తించవు

ఇన్ సైడర్ ట్రేడింగ్ కు ఐపీసీ సెక్షన్లు వర్తించవు
X

ఏపీ రాజధాని అమరావతి భూముల వ్యవహారానికి సంబంధించి కీలక పరిణామం. రాజధాని భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ.. సీఐడీ పెట్టిన కేసులను హైకోర్టు కొట్టివేసింది. కిలారు రాజేష్‌తో పాటు మరికొంత మంది..రాజధానిలో భూములు ముందుగానే కొనుగోలు చేశారని సీఐడీ కేసులు నమోదు చేసింది. రాజధానిలో ఉన్న ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదు చేసింది.

భూములు అమ్మినవారు ఎవరూ ఫిర్యాదు చేయలేదని..ప్రభుత్వం కక్షసాధిస్తోందని పేర్కొంటూ కిలారు రాజేష్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. భూములు అమ్ముకున్నవారు ఫిర్యాదు చేయకుండా కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం.. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ జరగలేదని పేర్కొంటూ.. దీనికి ఐపీసీ సెక్షన్లకు వర్తించవని హైకోర్టు స్పష్టం చేసింది.

Next Story
Share it