Telugu Gateway
Andhra Pradesh

కన్సల్టెంట్స్ ను ఆహ్వానిస్తూ ఆర్ఎఫ్ పీ

కన్సల్టెంట్స్ ను ఆహ్వానిస్తూ ఆర్ఎఫ్ పీ
X

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిని హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారికి కనెక్ట్ చేసేలా కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బ్రిడ్జి ఎన్ హెచ్ 65 లోని మూలపాడు నుంచి అమరావతి కాపిటల్ సిటీ లోని ఎన్ 13 రోడ్ కు అనుసంధానం చేయాలని ప్రతిపాదించారు. ఈ ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) సిద్ధం చేయటానికి కన్సల్టెంట్స్ ను ఆహ్వానిస్తూ అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసిఎల్) టెండర్లు పిలిచింది. ఆసక్తి ఉన్న కంపెనీలు ఈ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ ఎఫ్ పీ) ను డౌన్ లోడ్ చేసుకుని ఏప్రిల్ 21 లోగా తమ ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుంది.

రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు తొలిసారి ఏపీ సీఎం అయినప్పుడు కూడా ఇలాగే అమరావతి కి కనెక్ట్ చేసేలా ఐకానిక్ బ్రిడ్జి ప్లాన్ చేసి ఈ టెండర్లు కూడా అప్పట్లో ఎల్ అండ్ టి కి కేటాయించారు. 3 . 2 కిలోమీటర్ల ఈ ఐకానిక్ బ్రిడ్జి అంచనా వ్యయం 1387 కోట్ల రూపాయలు గా ఉంది.జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతి పనులు పక్కకు పోవటంతో అసలు మొదలు కాకుండానే ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. ఇప్పుడు కొత్త ఐకానిక్ బ్రిడ్జి దూరం అంటే దగ్గర దగ్గర ఐదు కిలోమీటర్లు ఉండే అవకాశం ఉన్నందున వల్ల ఈ సారి ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఏకంగా 2500 కోట్ల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది అని అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ వర్గాలు చెపుతున్నాయి.

ఇప్పటికే విజయవాడ పశ్చిమ బైపాస్ రెడీ అవుతున్నందున ఇంత వ్యయం చేసి కొత్తగా అమరావతికి కనెక్ట్ చేసేలా ఐకానిక్ బ్రిడ్జి అవసరం లేదు అన్నది అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు చెందిన కొంత మంది ఇంజినీర్లు చెపుతున్న మాట. మరో వైపు ఇప్పటికే కృష్ణా నదిపై పలు రైల్వే, హై వే బ్రిడ్జి లు ఉన్నందున కొత్తగా ఇప్పుడు ఐకానిక్ బ్రిడ్జి ను తెరమీదకు తెస్తే నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి వరదలు వచ్చినప్పుడు విజయవాడ నగరానికి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది అని కొంత మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి కి చెందిన ప్రాజెక్టులు అన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున ఈ ఐకానిక్ బ్రిడ్జి విషయంలో వెనక్కి తగ్గే అవకాశం లేదు అన్నది ఎక్కువ మంది అభిప్రాయం.

Next Story
Share it