జగన్ కు ఈడీ కోర్టు సమన్లు
BY Admin9 Jan 2021 5:29 AM GMT
X
Admin9 Jan 2021 5:29 AM GMT
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల11న హైదరాబాద్ లోని ఈడీ కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ మేరకు కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్ ఇటీవల నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు బదిలీ అయింది.
దీంతో అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్ ను విచారణకు స్వీకరించిన ఈడీ కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది. విజయసాయి రెడ్డి, హెటిరో డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, అరబిందో ఎండీ నిత్యానంద రెడ్డి, పీవీ రాంప్రసాద్ రెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్యకు ఈడీ కోర్టు సమన్లు జారీ అయ్యాయి.
Next Story