Telugu Gateway
Andhra Pradesh

దేవినేని ఉమ అరెస్ట్

దేవినేని ఉమ అరెస్ట్
X

కృష్ణా జిల్లా గొల్లపూడిలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా మంత్రి కొడాలి నాని, దేవినేని ఉమాల మధ్య విమర్శల పర్వం పీక్ కు చేరింది. దీంతో మాజీ మంత్రి ఉమ తాను గొల్లపల్లిలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర దీక్షకు కూర్చుంటానని సవాల్ విసిరారు.చేతనైతే తనను టచ్ చేయాలని సవాల్ విసిరారు. చెప్పినట్లుగానే ఆయన మంగళవారం ఉదయం దీక్షకు రెడీ అయ్యారు. అప్పటికే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయటంతోపాటు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. దేవినేని ఉమా దీక్షకు రెడీ కావటంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.

ఆ ప్రాంతానికి ఓ వైపు టీడీపీ కార్యకర్తలు, మరోవైపు వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేవినేని ఉమా దీక్ష తలపెట్టిన ప్రాంతానికి వైసీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీతోపాటు వసంత కృష్ణప్రసాద్ లు కూడా వచ్చారు. రోడ్లపై ఎలాగూ దీక్షకు అనుమతించరని తెలిసే ఉమా నాటకాలు ఆడుతున్నారని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ విమర్శించారు. మంత్రి కొడాలి సవాల్ విసిరితే ఉమా సీఎం జగన్ పేరు ఎందుకు ప్రస్తావిస్తున్నారని ప్రశ్నించారు. వల్లభనేని వంశీ మాట్లాడుతూ ఓ వేదిక ఖరారు చేస్తే ఉమాతో చర్చకు ఎక్కడైనా సిద్ధం అని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారని..చేతనైతే దానికి రెడీ కావాలన్నారు.

Next Story
Share it