ఏపీలో మళ్ళీ అవతరణ దినోత్సవాలు
ఏపీలో మళ్లీ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ప్రారంభం అయ్యాయి. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో దీన్ని పక్కన పెట్టారు. రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2 సందర్భంగా నివ నిర్మాణ దీ క్షలు అంటూ వారం రోజులు హంగామా చేశారు. ఐదేళ్లు అలాగే నడిచిపోయింద.జగన్ సీఎం అయిన తొలి ఏడాది ఏ కార్యక్రమం నిర్వహించలేదు. కానీ తాజాగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తరహాలోనే నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవం జరపాలని నిర్ణయించి దీనికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగానే సీఎం జగన్ ఆదివారం నాడు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో అవతరణ దినోత్సవాల్లో పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు 'మా తెలుగు తల్లికి' గీతాలాపన అనంతరం జాతీయ పతాకం ఎగురేశారు. అనంతరం తెలుగు తల్లికి, అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అవతరణ దినోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక ఆయా జిల్లాల్లో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
జిల్లా మంత్రులు అందుబాటులో లేకపోతే జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు ఆయా జిల్లాల్లో జాతీయ జెండా ఎగరేశారు. ప్రజల ఆనందకర జీవనమే ఏ ప్రభుత్వానికైనా విజయసూచికని.. ఆ మేరకు పాలన సాగాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరేలా చూడాలన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాజ్‌భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. 'రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోంది. ప్రజలే ప్రాధాన్యతగా అమలు చేస్తున్న విధానాలను ప్రభుత్వం కొనసాగించాలి. సామాన్యుల కలలను సాకారం చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని తన సందేశంలో గవర్నర్ పేర్కొన్నారు.