Telugu Gateway
Andhra Pradesh

కేడీల రాజ్యంలో రైతులకు బేడీలా?

కేడీల రాజ్యంలో రైతులకు బేడీలా?
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఏపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతులకు పోలీసులు బేడీలు వేయటాన్ని ఆయన తప్పుపట్టారు. ట్విట్టర్ వేదికగా ఈ అంశంపై సీరియస్ కామెంట్స్ చేశారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కాళ్లా వేళ్లా పడి అధికారం అడిగి తీసుకుంది దీనికేనా అని ప్రశ్నించారు. తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నారు. కేడీల రాజ్యంలో రైతులకు బేడీలా అనే చర్చకు దేశవ్యాప్తంగా తెరదీశారు. అన్నదాత కుటుంబాలను ఎందుకింత క్షోభ పెడుతున్నారు? మద్దతు ధర అడిగిన అన్నదాతలపై అక్రమ కేసులు, తమ భూములు లాక్కోవద్దని వేడుకున్న రైతులపై తప్పుడు కేసులు, స్వచ్ఛందంగా రాజధానికి భూములిచ్చిన రైతులపై అక్రమ కేసులు. ఏడాదిన్నరలో వేలాది రైతులపై ఇన్ని అక్రమ కేసులు ఏ రాష్ట్రంలో అయినా ఉన్నాయా? దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు పెట్టడం ఎక్కడైనా ఉందా..?

పురుగు మందు డబ్బాలతో దళిత మహిళలు తమ భూముల్లో పహారా తిరగడం ఎప్పుడైనా జరిగిందా..? అసైన్డ్ భూములను లాక్కుని దళిత రైతుల పొట్టగొట్టడానికా మీరు అధికారంలోకి వచ్చింది. ఒక్క ఛాన్స్ ఇచ్చిన నేరానికి బీసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీల ఉసురు పోసుకుంటారా? ఫిర్యాదుదారు కేసును ఉపసంహరించుకున్న తర్వాత కూడా రాజధాని రైతుల చేతులకు బేడీలు వేయడం తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధం. గతంలో రైతుల కాళ్లకు బేడీలు వేసిన పార్టీకి పట్టిన గతే వైసీపీకి కూడా పడుతుంది. రైతులకు బేడీలు వేసిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలి, ఇలాంటి దుర్మార్గాలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలి'' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

Next Story
Share it