Telugu Gateway
Andhra Pradesh

వ్యాక్సిన్ పై కేంద్రం ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి

వ్యాక్సిన్ పై కేంద్రం ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి
X

వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యంపై కేంద్రం ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి సూచించారు. ప్రస్తుత పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు అన్నారు. దేశానికి 172 కోట్ల వ్యాక్సిన్ డోసులు కావాలని.. ఇప్పటి వరకు కేంద్రప్రభుత్వం ఇచ్చింది కేవలం 18 కోట్ల వ్యాక్సిన్ డోసులు మాత్రమేనని తెలిపారు. ఏపీలో 18 ఏళ్లుపైబడ్డ వారికి 7 కోట్ల టీకా డోసులు కావాలని.. ఇప్పటివరకు కేంద్రప్రభుత్వం ఏపీకి ఇచ్చింది 73 లక్షల టీకా డోసులు మాత్రమేనని సీఎం వివరించారు.

దేశంలో కేవలం రెండు కంపెనీలే వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయని.. నెలకు 7 కోట్ల డోసులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. జగన్ గురువారం నాడు రైతు భరోసా నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాక్సినేషన్ అంశాన్ని ప్రస్తావించారు. 'వైఎస్ఆర్ రైతు భరోసా' కింద మూడో ఏడాది తొలి విడత సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. 52.38 లక్షల మంది రైతులకు రూ.3,928.88 కోట్ల సాయం అందిస్తున్నామని తెలిపారు.

Next Story
Share it