Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు కు రిలీఫ్

చంద్రబాబు కు రిలీఫ్
X

తెలుగు దేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్. ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజారు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసు లో ఆయనకు ఈ మధ్యంతర బెయిల్ వచ్చింది. అనారోగ్య కారణాల వల్ల తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అయన కోర్టు ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఒక వైపు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ తో పాటు అనారోగ్య కారణాల వల్ల మధ్యంతర బెయిల్ కోసం కూడా దరఖాస్తు కూడా చేశారు. దీనిపై సోమవారం నాడు వాదనలు పూర్తికాగా...ఆర్డర్ రిజర్వు చేసిన హై కోర్టు మంగళవారం నాడు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ బెయిల్ లో షరతులు ఏమిటి అన్నది తేలాల్సి ఉంది.

మరో వైపు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడి పై కొత్తగా మద్యం కంపెనీలకు అనుమతుల మంజూరులో అక్రమాలకు పాల్పడ్డారు అనే అంశంపై మరో కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు ను ఆంధ్ర ప్రదేశ్ సిఐడి సెప్టెంబర్ 9 న స్కిల్ కేసు లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తర్వాత వరసగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్, అసైన్మెంట్ భూముల కేసు లు కూడా తెరమీదకు తీసుకు వచ్చి పీటి వారంట్స్ కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే. మెడికల్ గ్రౌండ్స్ లో బెయిల్ మంజూరు అయినందున ఆయనకు తాత్కాలిక ఊరట దక్కినట్లు చెప్పొచ్చు.

Next Story
Share it