Telugu Gateway
Andhra Pradesh

ఎన్నికల నోటిఫికేషన్ రద్దు..అప్పీల్ కు ఎస్ఈసీ

ఎన్నికల నోటిఫికేషన్ రద్దు..అప్పీల్ కు ఎస్ఈసీ
X

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై సోమవారం నాడు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఎస్ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ ను హైకోర్టు రద్దు చేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే సింగిల్ బెంచ్ తీర్పు సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఎస్ఈసీ తన అప్పీల్ లో పేర్కొంది.

సంక్రాంతి సెలవులు ఉన్న కారణంగా అత్యవసర పిటీషన్ గా భావించి ఈ కేసు విచారించాలని ఎస్ఈసీ తరపు న్యాయవాది డివిజన్ బెంచ్ ను అభ్యర్ధించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉన్నప్పటికీ ఎన్నికలు నిర్వహించడానికి ఉన్న అవకాశాలను కోర్టుకు వివరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం యోచిస్తోంది. ఈ పిటీషన్ పై విచారణ మంగళవారం నాడు జరిగే అవకాశం ఉందని సమాచారం.

Next Story
Share it