ఏపీ పంచాయతీ ఎన్నికలు రీషెడ్యూల్
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో పరిణామాలు చకచకా సాగుతున్నాయి. వాస్తవానికి తొలి దశ ఎన్నికలకు సంబంధించి సోమవారం నాడే నామినేషన్లు స్వీకరించాల్సి ఉంది. కానీ ప్రభుత్వ సహాయ నిరాకరణ వల్ల అది ముందుకు సాగలేదు. దీంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను రీషెడ్యూల్ చేశారు. కొన్ని మార్పులు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. మొదటి విడత ఎన్నికలను నాలుగో విడతగా మార్చి అందుకు కొత్త తేదీని ఎన్నికల సంఘం ప్రకటించింది.
మార్చి 21న నాలుగో విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఇక రెండు, మూడు, నాలుగు విడతల ఎన్నికలను ఒకటి, రెండు, మూడు విడతలుగా మార్చి వాటిని యథాతథంగా జరపనున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. మారిన షెడ్యూల్ ప్రకారం తొలి విడత ఎన్నికలు ఫిబ్రవరి 7న, రెండో విడత ఫిబ్రవరి 13న, మూడో విడత ఫిబ్రవరి 17, నాలుగో విడత ఫిబ్రవరి 21న జరగనున్నాయి.