Telugu Gateway
Andhra Pradesh

దావోస్ బిల్డప్ కు 30 లక్షలు కేటాయిస్తూ జీవో

దావోస్ బిల్డప్ కు 30 లక్షలు కేటాయిస్తూ జీవో
X

ఆంధ్ర ప్రదేశ్ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...మంత్రి నారా లోకేష్ అన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. తమ బ్రాండ్ ఇమేజ్ వల్లే గత పద్దెనిమిది నెలలుగా రాష్ట్రానికి కుప్పలు తెప్పలుగా పెట్టుబడులు వస్తున్నాయి అని కూడా ఊదరగొడుతున్నారు. కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా రూపాయి కు 22 ఎకరాలు...99 పైసలకు 20 ఇచ్చుకుంటూ పోయే విషయాన్ని మాత్రం పెద్దగా చెప్పరు. ఇంత కారు చౌకగా భూములు ఇవ్వటమే కాదు..కంపెనీలు కోరింది కోరినట్లు రాయితీలు..ప్రోత్సహకాలు కూడా కలిపిస్తున్నారు. ఇవి చాలవు...ఇంకా పాలసీ మార్చి కూడా రాయితీలు ఇవ్వటానికి కూడా సర్కారు ఏ మాత్రం వెనకాడటం లేదు. ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టి జి భరత్ తో పాటు అధికారుల బృందం దావోస్ కు వెళ్లనుంది. ఇప్పటికే దీనికి సంబదించిన జీవో కూడా జారీ అయింది.

ఇప్పుడు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ మీటింగ్ లో బిజినెస్ టుడే మల్టీవర్స్ మ్యాగజైన్ లో 20 పేజీల సమగ్ర సమాచారంలో ప్రకటనల కోసం అని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 30 లక్షలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మళ్ళీ దీనికి జీఎస్టి ఆదనం. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ బుధవారం నాడు జీఓ జారీ చేశారు. ఇది ఇక్కడితో ఆగే అవకాశం కూడా లేదు. రాబోయే రోజుల్లో ఇలాంటివి మరిన్ని జీవో లు వచ్చే అవకాశం ఉంది అని చెపుతున్నారు. గత ఏడాది కూడా పలు జాతీయ బిజినెస్ ఛానెల్స్ కు ప్రమోషన్స్ కోసం లక్షల రూపాయలు విడుదల చేశారు.

Next Story
Share it